పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: కానుగుల జోగయ్య

వెల్దండలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

1001408816.jpg

వెల్దండ,నవంబర్ 28: వెల్దండ మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కానుగుల జోగయ్య, మాజీ సర్పంచ్ మొక్తాల శేఖర్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జోగయ్య మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త అని,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, విద్యాభివృద్ధికి, సమాన హక్కుల సాధనకు తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.పూలే దంపతుల ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం, విద్యాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లింగం,గుత్తి వెంకటయ్య, వార్డు సభ్యులు జంగిలి సునీత ఆనంద్,జంగిలి ప్రవీణ్,జంగిలి రవికుమార్, మట్ట శ్రీనుగౌడ్,రాజు నాయక్, జగన్ నాయక్, జంగిలి శ్రీనివాస్,దాసరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...