వైమానిక దళ ఉద్యోగాలపై డిసెంబర్ 5న అవగాహన కార్యక్రమం
- వైమానిక దళ ఉద్యోగాలపై డిసెంబర్ 5న అవగాహన కార్యక్రమం - November 27, 2026
- .20 వేలకు రూ.లక్ష ఆశ.. భారీ మోసంపై బాధితుల ఆందోళన! - November 27, 2026
- పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు – కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ - November 27, 2026

నాగర్‌కర్నూల్, నవంబర్ 27: భారత వైమానిక దళంలో ఉద్యోగ అవకాశాలపై యువతకు అవగాహన కల్పించేందుకు డిసెంబర్ 5న నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అగ్నివీర్ వాయు, ఎయిర్‌మెన్ తదితర ఉద్యోగ అవకాశాలు, వాటికి అవసరమైన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియపై అవగాహన కల్పించనున్నారు.ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదువుతున్న యువతీ యువకులతో పాటు 16 సంవత్సరాలు పైబడిన అర్హులైన విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.దేశ రక్షణలో భాగస్వాములు కావాలనే ఆసక్తి ఉన్న యువత ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
