పూజల పేరుతో రూ.50 లక్షల మోసం.. ప్రధాన నిందితుడు అరెస్ట్

కీసర: కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు, తాంత్రిక ఆచారాల పేరుతో ఓ వ్యక్తిని నమ్మించి సుమారు రూ.50 లక్షలు వసూలు చేసిన కేసులో ప్రధాన నిందితుడు కాళం క్రాంతి కుమార్ అలియాస్ క్రాంతిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో మనోవేదనకు గురైన బాధితుడికి పూజల ద్వారా కుమార్తెను తిరిగి తీసుకొస్తామని, లేదంటే ఆమె భర్తను అంతమొందిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడి నుంచి రూ.25,02,500 నగదు, బంగారు ఉంగరం, 50 తులాల వెండి బిస్కెట్లు, రెండు సెల్‌ఫోన్లు, SBI ATM కార్డు స్వాధీనం చేసుకున్నారు. A2 రత్న, A3 పుట్టి సాయి పరారీలో ఉన్నారు. క్రైం నెం.1198/2026, BNS 318(4) కింద కేసు నమోదు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని ఏసీపీ ఎస్. చక్రపాణి తెలిపారు.

You may also like...