విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం

తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లీగల్ అవేర్‌నెస్ క్యాంపు, మానవ అక్రమ రవాణా నిరోధక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎం.ఎస్.టి. నాగరాణి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ గేమ్స్ వల్ల కలిగే ప్రమాదాలు, మానవ హక్కులు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, వ్యక్తిగత భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ తమ హక్కులను తెలుసుకోవాలని, ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏహెచ్‌టీయూ రాజేందర్, సాధన ఎన్జీవో కోఆర్డినేటర్ గిరిజ, శివకుమార్, మండల విద్యాధికారి రామస్వామి, ఉపాధ్యాయులు గిరి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like...