మురికినీటి శుద్ధి నిర్వాహణపై హైడ్రా నిఘా

బాచుపల్లిలో పర్యటించి పరిస్థితులపై సమీక్ష.. మానవ హక్కుల కమిషన్ సమక్షంలో విచారణ

 నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్వహణపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం బాచుపల్లిలోని ఎస్టీపీలను పరిశీలించి, వాటి నిర్వహణ తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం ఎస్టీపీల నిర్మాణంతో పాటు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఇటీవల మురుగునీటి ట్యాంకులో చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఎస్టీపీల నిర్మాణం, నిర్వహణ, భద్రతా అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

You may also like...