కరడ్‌పల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తల సమావేశం

భారతీయ జనతా పార్టీ తాడ్వాయి మండల శాఖ అధ్యక్షులు శ్రీ యెల్మ సంతోష్ రెడ్డి గారి అధ్యక్షతన కరడ్‌పల్లి గ్రామంలో నిన్న రాత్రి బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో వివిధ మోర్చాల కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు, బీజేపీ కరడ్‌పల్లి గ్రామ అధ్యక్షులుగా శ్రీ మహిపాల్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల యువమోర్చా అధ్యక్షులు శ్రీ తిరుపతి రెడ్డి గారు, సీనియర్ నాయకులు డా. రమేష్ నాయీ గారు,
 మండల ప్రధాన కార్యదర్శి శ్రీ ముదాం దత్తాద్రి గారు, ఇతర సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...