రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) మల్కాజిగిరి, గంజాయి అక్రమ కార్యకలాపాలపై చర్యల్లో భాగంగా ఎస్ఓటీ మల్కాజిగిరి జోన్ టీమ్–1, జవహర్నగర్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి 22 ఏళ్ల బీటెక్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. సంతోషి నగర్, బాలాజీనగర్ పరిధిలో నిందితుడు గంజాయి మొక్కలను పెంచుతూ, ఎండు గంజాయిని కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి సుమారు రెండడుగుల ఎత్తున్న రెండు గంజాయి మొక్కలు, నాలుగు గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ రూ.5 వేలు. ఎస్ఓటీ మల్కాజిగిరి జోన్ టీమ్–1, జవహర్నగర్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించగా, గంజాయి సరఫరా మూలాలు, ఇతర నిందితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
