రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all)
బాచుపల్లి, నవంబర్ 21: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ శనివారం బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి తనిఖీ నిర్వహించారు. డయల్ 112కు ఫిర్యాదు చేసిన బాధితులను సంప్రదించి, వారి సమస్యలు పరిష్కారమయ్యాయో లేదో నిర్ధారించుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు. నేర సంబంధిత, వదిలివేసిన వాహనాల జాబితా రూపొందించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్ పరిసరాలు, పురుష సిబ్బంది వసతి గృహం, మహిళా కౌన్సెలింగ్ కేంద్రాన్ని పరిశీలించి పరిశుభ్రతపై సూచనలు చేశారు. ఈ పర్యటనలో కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి, ఐపీఎస్, ఏసీపీ ఎ.సి. బాల గంగిరెడ్డి పాల్గొన్నారు.
