బాచుపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సైబరాబాద్ సిపి
బాచుపల్లి, నవంబర్ 21: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ శనివారం బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి తనిఖీ నిర్వహించారు. డయల్ 112కు ఫిర్యాదు చేసిన బాధితులను సంప్రదించి, వారి సమస్యలు పరిష్కారమయ్యాయో లేదో నిర్ధారించుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు. నేర సంబంధిత, వదిలివేసిన వాహనాల జాబితా రూపొందించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్ పరిసరాలు, పురుష సిబ్బంది వసతి గృహం, మహిళా కౌన్సెలింగ్ కేంద్రాన్ని పరిశీలించి పరిశుభ్రతపై సూచనలు చేశారు….
