రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) హైదరాబాద్: ఏఎండీ గ్రూప్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన లిటరసీ రన్ కార్యక్రమంలో ఏడీసీపీ ట్రాఫిక్ జి. హనుమంతరావు, రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉన్నత తరగతులకు చెందిన సుమారు 300 నుంచి 400 మంది విద్యార్థులు మూడు కిలోమీటర్ల పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, హెల్మెట్ వినియోగం, పాదచారుల భద్రతపై అవగాహన కల్పించారు. సైబరాబాద్ మూవ్స్–2026 కార్యక్రమ ప్రాముఖ్యతను వివరించి, యువత బాధ్యతాయుతమైన రోడ్డు వినియోగదారులుగా మారాలని ఏడీసీపీ పిలుపునిచ్చారు.
