బాలల భద్రతపై విద్యార్థులకు అవగాహన
- బాలల భద్రతపై విద్యార్థులకు అవగాహన - October 31, 2026
- ఆర్టీసీ బస్సు ఢీకొని మేస్త్రీ దుర్మరణం.. ఇద్దరు కుమార్తెలకు తీరని శోకం - October 30, 2026
- అటవీ శాఖకు పోలీసుల పూర్తి సహకారం - October 28, 2026
సురక్షిత్ బచ్పన్ అభియాన్‌లో భాగంగా శనివారం కొత్తబాది కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు నేర చట్టాలు, బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ బాన్సువాడ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ సాయిబాబు మాట్లాడుతూ పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, వ్యక్తిగత భద్రతపై విద్యార్థులకు వివరించారు. ఆపదలో ఉన్న బాలలు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్‌ఓ విజయలక్ష్మి, పారా లీగల్ వాలంటీర్ అయ్యల సంతోష్, కోర్టు సిబ్బంది గబ్బర్ సింగ్, నర్సింగ్, లక్ష్మణ్, ఫారుక్ తదితరులు పాల్గొన్నారు.
