KGBV బాలికలకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ

నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో విద్యార్థినులకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్స్, షూస్, టై, బెల్ట్ తదితర సామగ్రిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థినుల విద్యాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రజా పండరి, సర్పంచులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, వార్డు సభ్యులు, యువజన కాంగ్రెస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...