తలకొండపల్లిని కరువు మండలంగా ప్రకటించండి – బీఆర్ఎస్ డిమాండ్

1001390832.jpg

కల్వకుర్తి నియోజకవర్గంలో ఆమనగల్, మాడుగుల మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించగా, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సొంత మండలమైన తలకొండపల్లిని జాబితాలో చేర్చకపోవడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.

తలకొండపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కటికెల శేఖర్ యాదవ్, సర్పంచులు వట్టెల నిర్మల, కోర్ర శిరీష తదితరులు – తలకొండపల్లికి కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్న కేశంపేటను కరువు మండలంగా ప్రకటించి, తలకొండపల్లిని వదిలేయడం విడ్డూరంగా ఉందన్నారు. పంటలు ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటి రైతులు నష్టపోతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో సరిగా పరిశీలించలేదని ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను మళ్లీ సమగ్రంగా పరిశీలించి తలకొండపల్లిని కరువు మండలంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.

You may also like...