కరువుపై రాజకీయం తగదు.. ఎల్‌నినో ప్రభావమే ప్రధాన కారణం: ఎమ్మెల్యే కసిరెడ్డి

1001309878.jpg

కల్వకుర్తి, అక్టోబర్ 29: కల్వకుర్తి నియోజకవర్గంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రాజకీయాలు చేయడం తగదని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ఎల్‌నినో ప్రభావంతోనే ఈసారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.కరువు పరిస్థితులపై గత కొన్ని నెలలుగా గ్రామస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోకుండా కొందరు రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.రైతులు అధైర్యపడవద్దని, నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కరువు నివారణకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

You may also like...