పాలమూరును కాపాడాలని పాదయాత్ర
- బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరామర్శ - September 27, 2026
- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాకై కాంగ్రెస్ ధర్నా - September 27, 2026
- బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి మాజీమంత్రి కేటీఆర్ ఘన నివాళి - September 27, 2026
కల్వకుర్తి సెప్టెంబర్ : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి అక్రమంగా 30 టీఎంసీల నీటిని తరలించి పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చే కుట్రను వ్యతిరేకిస్తూ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు చేపట్టిన ఈ పాదయాత్రలో బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ పాదయాత్రలో పరిసర గ్రామాలకు చెందిన రైతులు, రైతు సంఘాల నాయకులు,జేఏసీ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాలమూరు ప్రాంత ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాడుతామని వారు స్పష్టం చేశారు.
