బీజేపీలో చేరిన యువ నాయకుడు శంకర్ నాయక్
- బీజేపీలో చేరిన యువ నాయకుడు శంకర్ నాయక్ - October 29, 2026
- కరువుపై రాజకీయం తగదు.. ఎల్నినో ప్రభావమే ప్రధాన కారణం: ఎమ్మెల్యే కసిరెడ్డి - October 29, 2026
- బొల్లంపల్లిలో అధికారులకు ఘన సన్మానం - October 29, 2026

అచ్చంపేట అక్టోబర్ 29: మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ మాజీ గ్రామ అధ్యక్షులు శంకర్ నాయక్,మాజీ ఎమ్మెల్యే డా. గువ్వల బాలరాజు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.ఈ సందర్భంగా గువ్వల బాలరాజు శంకర్ నాయక్ పార్టీ కండువా కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. అభివృద్ధి,సుపరిపాలన, సంక్షేమం,యువతకు అవకాశాలు మరియు దేశ సమగ్ర ప్రగతి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషికి ఆకర్షితులై నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి వరికుప్పల ఆంజనేయులు,జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి అఖిల్ రెడ్డి,గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రవీందర్ చౌహన్,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ రెడ్డి, బిజెపి నాయకులు పత్య నాయక్,పిట్టల కృష్ణయ్య, దేవపూజ రమేష్ పాల్గొన్నారు.
