చల్లపల్లిలో బాల భక్త బృందం లడ్డు వేలం – దక్కించుకున్న ఎర్ర జంగయ్య
- ఘనంగా నీలకంఠం పాండు జన్మదిన వేడుకలు - September 25, 2026
- చల్లపల్లిలో బాల భక్త బృందం లడ్డు వేలం – దక్కించుకున్న ఎర్ర జంగయ్య - September 25, 2026
- అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో చిన్న లడ్డు వేలం.. దక్కించుకున్న మనోహర్ - September 25, 2026

వెల్దండ: మండలంలోని చల్లపల్లి గ్రామంలో చిన్నారుల బాల వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశుడి లడ్డూ వేలంపాట భక్తుల ఆనందోత్సాహాల మధ్య జరిగింది. వేలంపాటలో ఎర్ర జంగయ్య (మేస్త్రి) రూ.8,600కు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం బాల భక్త బృందం సభ్యులు జంగయ్యను శాలువాతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో వెల్దండ ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు పకాడి అంజయ్య, వార్డు సభ్యులు పోలి అంజయ్య, పకాడి అయోధ్య ,జంగయ్య, మహేష్, సాయి హర్షిత్, అరవింద్, సందీప్, శివ, రిషి, లడ్డు, చేతన్ తదితరులు పాల్గొన్నారు.
