రిపోర్టర్, కామారెడ్డి | 9989390343
Latest posts by Kethavath Permal
(see all) 
అటవీ ప్రాంతాల పరిరక్షణ, అటవీ సంపద సంరక్షణతో పాటు అటవీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర హామీ ఇచ్చారు.కామారెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్, ఎస్పీ, జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ ఆధ్వర్యంలో అటవీ, పోలీసు శాఖల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు, అటవీ ప్రాంతాల రక్షణ, విధుల నిర్వహణలో భద్రత తదితర అంశాలపై చర్చించారు. శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అటవీ సంపద పరిరక్షణకు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమిస్తూ సమష్టిగా పనిచేయాలని సూచించారు.