ఓటే వజ్రాయుధం.. మాజీ ఎంపిటిసి హనుమంతు నాయక్
- ఓటే వజ్రాయుధం.. మాజీ ఎంపిటిసి హనుమంతు నాయక్ - October 27, 2026
- మృతుని కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం - October 27, 2026
- అజిలాపూర్ భూ పట్టా మార్పిడిపై ఆర్టీఐ దరఖాస్తు - October 27, 2026

వెల్దండ: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని మాజీ ఎంపిటిసి హనుమంత నాయక్ అన్నారు.మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకుని,ఆ దరఖాస్తును వెల్దండ మండల తహసీల్దార్ కార్తీక్ కుమార్కు అందజేశారు. మండలంలోని ఓటు నమోదు చేసుకోని అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రభాకర్, మాజీ వార్డు సభ్యుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
