పీఏసీఎస్‌ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

జ్ఞాన తెలంగాణ, అక్టోబర్ 27: హెచ్‌డీసీసీబీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో శంకర్‌పల్లి, మొకిలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) చైర్మన్లు బొల్లారం వెంకట్ రెడ్డి,గౌండ్ర సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. నిధుల కేటాయింపుతో సహకార సంఘాలను బలోపేతం చేయడంతో పాటు రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం హెచ్‌డీసీసీబీ సీఈఓ భాస్కర సుబ్రహ్మణ్యం, జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, ఓఎస్‌డీ మనోజ్ కుమార్‌లను పీఏసీఎస్‌ చైర్మన్లు మర్యాదపూర్వకంగా సన్మానించారు. సమావేశంలో పీఏసీఎస్‌ల అభివృద్ధి, నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు.

You may also like...