మృతుని కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం
- ఓటే వజ్రాయుధం.. మాజీ ఎంపిటిసి హనుమంతు నాయక్ - October 27, 2026
- మృతుని కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం - October 27, 2026
- అజిలాపూర్ భూ పట్టా మార్పిడిపై ఆర్టీఐ దరఖాస్తు - October 27, 2026

వెల్దండ, అక్టోబర్ 27: వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఎం. దాసు మృతి చెందడంతో ఆయన కుటుంబానికి గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అండగా నిలిచారు.ఈ సందర్భంగా మంగళవారం మృతుని కుటుంబానికి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మట్ట భారత్ గౌడ్ చేతులమీదుగా రూ.5,000 ఆర్థిక సాయం అందజేసి,వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొయ్యల పుల్లయ్య,మంగళగిరి శ్రీను,బిట్టి చందు,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జంగిలి ఆనంద్ రాజ్,ఎండీ సమీర్,తుంగ శ్రీను,పుట్ట శివ,బిట్టి సైదులు,సిద్ధు,రమేష్,కూన నాని, బాలరాజ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
