నేడు కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన
- నేడు కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన - October 27, 2026
- రేపు బాన్సువాడకు మంత్రి సీతక్క - October 26, 2026
- హామీల కోసం ఉద్యమకారుల పోరు.. బాన్సువాడలో అరెస్ట్‌లు - October 26, 2026
తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క మంగళవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రామారెడ్డి, సదాశివనగర్, బాన్సువాడ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పోసానిపేటలో మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించనుండగా, గిద్దె, కుప్రియాల్ గ్రామాల్లో సబ్స్టేషన్ల స్థలాలను పరిశీలిస్తారు. బాన్సువాడ మండలం కొయగూట్ట తండాలో గ్రామపంచాయతీ, మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. కొయగూట్టలో మహిళా మండలి భవనాన్ని ప్రారంభించి, బోర్లంలో నూతన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించడంతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి పర్యటనకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
