శిలాఫలకంపై ఉప సర్పంచ్ పేరు లేకపోవడంతో ఎమ్మార్పీఎస్ ధర్నా

ఊర్కొండ, అక్టోబర్ 10: గ్రామపంచాయతీ నూతన భవన శిలాఫలకంపై దళిత ఉపసర్పంచ్ దుబ్బ భాగ్యరాణి పేరు చేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు శనివారం ఇప్పపహాడ్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు మాదిగ మాట్లాడుతూ, వి.బి.-జీ రామ్‌జీ నిధులతో నిర్మించనున్న గ్రామపంచాయతీ నూతన భవనానికి భూమిపూజ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఉపసర్పంచ్ పేరు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దళితురాలు కావడం వల్లే ఆమె పేరును చేర్చలేదా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంపై అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రజాప్రతినిధులందరికీ సముచిత గౌరవం కల్పించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేష్, రాములు, బాలస్వామి, మైసయ్య, శ్రీశైలం, అంజిబాబు, బుచ్చయ్య, వెంకటయ్య, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.1001252792.jpg

You may also like...