భక్తిశ్రద్ధలతో ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలు

భక్తిశ్రద్ధలతో ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 10 : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలను శనివారం మండల ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలు పలు రకాల బత్తుకమ్మలను పేర్చి ప్రధాన కూడళ్ల వద్ద ఉంచి బతుకమ్మ పాటలను పాడి, ఆటలు ఆడారు. అనంతరం ఆయా గ్రామాల చెరువులలో నిమజ్జనం చేశారు. మండల కేంద్రంలో ఉత్తమ బతుకమ్మలను పేర్చిన వారికి లయన్స్ క్లబ్ కట్టంగూర్ కింగ్స్ సభ్యులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లు ముక్కామల శ్యామల శేఖర్, వడ్డె మాధవి, బెల్లి సుధాకర్, కురిమిల్ల మల్లేష్, గుల్లి నరేష్, కుంభం అనిల్ రెడ్డి, ధార సత్తెమ్మ, ఇప్పలపల్లి అనిత, కొలిపాక సురేందగౌడ్, తోటకూరి జలజ, సుంకరబోయిన సంధ్య, మల్లెబోయిన యాదగిరి, లయన్స్ క్లబ్ కట్టంగూర్ కింగ్స్ అధ్యక్షులు గుడిపాటి శివప్రసాద్, కార్యదర్శి మంగదుడ్ల శ్రీనివాస్, కోశాధికారి కల్లూరి వెంకటేశ్వర్లు, సలహాదారులు రెడ్డిపల్లి సాగర్, చిక్కు శేఖర్, మహిళలు పాల్గొన్నారు.1000373128.jpg

You may also like...