బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరం : కట్టంగూర్
సర్పంచ్ శ్యామల శేఖర్
- శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - August 16, 2026
- రాష్ట్రపతి భవన్లో ఘనంగా ఎట్ హోమ్ రిసెప్షన్ - August 15, 2026
- అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు - August 15, 2026

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 4.:
తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఐసీడీఎస్ సూపర్ వైజర్ శారదారాణితో కలిసి పాల్గొని చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ముర్రుపాలు పట్టించాలన్నారు. అప్పుడే వచ్చే ముర్రుపాలలో బలవర్ధకమైన స్యూట్రీషియన్లు, ప్రోటీన్లు ఉంటాయన్నారు. తల్లిపాల వల్ల భవిష్యత్ లో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని అన్నారు. ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు మైనం ఉమ. ఏనుగు సైదులు, శ్రీరామ సంధ్య, కల్లెం నాగేశ్వర్రావు, అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, గర్భిణులు తదితరులు పాల్గొన్నారు.
