ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు శుభవార్త..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు శుభవార్త.. చరిత్రలో నిలిచిపోయే విధంగా రూ.22.84 కోట్లతో 8 విద్యుత్ సబ్‌స్టేషన్లకు మంజూరు.*

ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషితో రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి కీలక ముందడుగు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు చేసిన నిరంతర కృషి ఫలించింది. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రూ.22.84 కోట్ల అంచనా వ్యయంతో 8 నూతన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు మంజూరు లభించింది. ఈ నిర్ణయం నియోజకవర్గ రైతులకు ఎంతో ఊరటనివ్వనుంది. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సరఫరా సమస్యలను దృష్టిలో ఉంచుకొని, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు నూతన సబ్‌స్టేషన్ల ఆవశ్యకతను ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు స్వయంగా ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి **శ్రీ భట్టి విక్రమార్క గారి** దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఇబ్బందులను వివరిస్తూ సబ్‌స్టేషన్ల మంజూరు కోసం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో పాటు నిరంతరం కృషి చేశారు. ఎమ్మెల్యే గారి చొరవతో ఎనిమిది సబ్‌స్టేషన్లకు మంజూరు లభించింది.

 *మంజూరైన సబ్‌స్టేషన్ల వివరాలు:*

1. ధర్మారావుపేట – సదాశివనగర్ మండలం:రూ.2.68 కోట్లు

2. కుప్రియాల్ – సదాశివనగర్ మండలం:రూ.2.63 కోట్లు

3. తిమ్మోజివాడి – సదాశివనగర్ మండలం:రూ.2.35 కోట్లు

4. లింగంపల్లి – లింగంపేట మండలం:రూ.3.37 కోట్లు

5. గిద్ద – రామారెడ్డి మండలం:రూ.2.83 కోట్లు

6. వాడల్‌పర్తి – నాగిరెడ్డిపేట మండలం:రూ.2.62 కోట్లు

7. గుర్జాల్ – గాంధారి మండలం:రూ.3.03 కోట్లు

8. వెల్లుట్ల – ఎల్లారెడ్డి మండలం:రూ.3.33 కోట్లు

మొత్తం 8 సబ్‌స్టేషన్లు – రూ.22.84 కోట్ల నిధులు. రైతులకు మెరుగైన విద్యుత్ సరఫరా దిశగా కీలక అడుగు

ఈ నూతన సబ్‌స్టేషన్ల ఏర్పాటుతో విద్యుత్ పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు, వ్యవసాయ అవసరాలకు మరింత నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఈ సబ్‌స్టేషన్లు దోహదపడనున్నాయి. తద్వారా రైతులకు సాగు సమయంలో ఎదురయ్యే విద్యుత్ సంబంధిత సమస్యల నుంచి గణనీయమైన ఉపశమనం లభించే అవకాశం ఉంది. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన నిధులు, అభివృద్ధి పనులు సాధించడంలో ఆయన చొరవ మరోసారి స్పష్టమైంది. ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతుల విద్యుత్ కష్టాలను తగ్గించి, వ్యవసాయానికి మెరుగైన విద్యుత్ సదుపాయాలు కల్పించే దిశగా రూ.22.84 కోట్లతో 8 సబ్‌స్టేషన్ల మంజూరు ఒక కీలక ముందడుగు. రైతు సంక్షేమమే లక్ష్యం.. ఎల్లారెడ్డి అభివృద్ధే ఎమ్మెల్యే మదన్ మోహన్ ధ్యేయం.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...