క్రీడలు శరీరక దృఢత్వానికి మానశిక ప్రశాంతతకు ఎంతో దోహదం
- అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు… - October 9, 2026
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- మంచాల గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగింది. - October 9, 2026

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, అక్టోబర్ 09:
శారీరకదుర్గత్వానికి మానసిక ప్రశాంతతకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని రెండు నారాయణ పాఠశాల జిఎం ఎస్ గోపాల్ రెడ్డి తెలిపారు. సనత్ నగర్ జిహెచ్ఎంసి గ్రౌండ్ నందు ఎస్సార్ నగర్ జోన్లోని 9 పాఠశాలలు పాల్గొన్న నారాయణ ప్రీమియం లీగ్ క్రీడా పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాలల జీఎం గోపాల్ రెడ్డి, ఏటీఎం శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో క్రీడల పోటీలను నిర్వహించారు. ఈ క్రీడల పోటీలలో జోన్ నుండి ఎస్సార్ నగర్, జూబ్లీహిల్స్, అత్తాపూర్, మెహదీపట్నం, విజయనగర్ కాలనీ, మణికొండ, హైటెక్ సిటీ, శంషాబాద్, కిస్మత్పూర్, బ్రాంచ్ల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడల్లో విద్యార్థులు అత్యద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని వారన్నారు. ఈ క్రీడా సంబరాల్లో పాఠశాల ప్రిన్సిపాల్ రత్నకుమారి, ఆర్ ఐ నవీన్, శర్వాణి, కోఆర్డినేటర్ ఫర్జానా, వైస్ ప్రిన్సిపాల్ గురుప్రీత్ కౌర్, పీఈటీలు ఏవోలు, ఉపాధ్యాయులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
