పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం
- “విజయం ఒక్కరోజులో రాదు.. పట్టుదలతో సాగిన ప్రతి అడుగూ విజయానికి పునాది.” - September 22, 2026
- స్వర్ణ సంచలనం..లంకపై భారత్ ఘన విజయం! - September 22, 2026
- రిమ్స్ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం - September 22, 2026

దివంగత బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరఫున రూ.2 కోట్ల 25 లక్షల ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నిర్ణయించారు. పార్టీ సీనియర్ నేతలు, వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.1 కోటి చొప్పున, వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అమృతమ్మ సంక్షేమం కోసం మరో రూ.25 లక్షలు అందజేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా పిల్లల విద్య, భవిష్యత్తు, కుటుంబ సంక్షేమానికి సంబంధించిన అంశాలను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని విధాలా అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మలు పూర్తైన అనంతరం జిల్లా పార్టీ ముఖ్య నాయకులు సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించిన తదుపరి చర్యలను నిర్ణయిస్తారని, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ పార్టీ అండగా నిలుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.
