భూవివాదంపై న్యాయం చేయాలంటూ ఎమ్మార్వో కు వినతి
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- జూపల్లి లో ఘనంగా దుర్గ భవాని అమ్మవారి ఆగమనం - October 9, 2026
- మృతురాలి కుటుంబానికి సర్పంచ్ పరామర్శ..ఆర్థిక సాయం - October 9, 2026

తలకొండపల్లి:రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో భూ వివాదం పరిష్కరించాలని కోరుతూ అంపటి సత్తయ్య కుటుంబ సభ్యులు ఎమ్మార్వో రమేష్‌కు వినతిపత్రం అందజేశారు.సర్వే నంబర్ 4లోని మూడున్నర కుంటల భూమిని గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని, అయితే ఆ భూమి విషయంలో రిజిస్ట్రేషన్ వివాదం తలెత్తిందని సత్తయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ వార్డు సభ్యుడు పుల్లారెడ్డి దశరథం పేరుతో భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని,ఈ వ్యవహారంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు.ఈ వివాదం కారణంగా గత ఐదేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని,తమను బెదిరిస్తున్నారని సత్తయ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు.భూమి విషయంలో పలుమార్లు సర్వే చేయించామని,కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా పొందామని తెలిపారు.తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులు భూ వివాదాన్ని పరిశీలించి చట్ట ప్రకారం న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
