అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

1000203908.jpg

తెలంగాణలో ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరిపించాలని జనగామ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓట్ల తొలగింపు ప్రక్రియలో బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందిందని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 95 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారని, రెండు దశల్లో కలిపి 94 లక్షల ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని కోరారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఓటు హక్కు పరిరక్షణకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పండుగ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ధర్నాను వాయిదా వేసినట్లు తెలిపారు.

You may also like...