పాఠశాల లైబ్రరీకి రూ.20 వేల విలువైన పుస్తకాలు అందజేత

పాఠశాల లైబ్రరీకి రూ.20 వేల విలువైన పుస్తకాలు అందజేత

జ్ఞాన తెలంగాణ జనగామ ప్రతినిధి, సెప్టెంబర్ 18

జనగామలోని మన జెడ్పీహెచ్‌ఎస్ ధర్మకంచె పాఠశాలలో 1982–83 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి రమేష్ కుమార్ బజాజ్ పాఠశాల లైబ్రరీకి రూ.20 వేల విలువైన పుస్తకాలను అందజేశారు. అలాగే పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు టాప్ ర్యాంకర్లకు నగదు పారితోషికాలను అందజేశారు.ఈ సందర్భంగా జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాలల సీడీసీ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పూర్వ విద్యార్థి రమేష్ కుమార్ బజాజ్ పాఠశాల అభివృద్ధికి అందించిన సహకారం అభినందనీయమన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు పారితోషికాలు అందించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్లాస్‌మేట్స్, పూర్వ విద్యార్థులు రమేష్ కుమార్ బజాజ్‌ను ప్రత్యేకంగా అభినందించి, ఆయన సేవాభావం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

You may also like...