కట్టంగూర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన
జ్ఞాన తెలంగాణ కట్టంగూర్, అక్టోబర్ 8: ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన శాంతియుత ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులను పోలీసులు అరెస్టు చేసి, లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ కట్టంగూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు సుంకరబోయిన వెంకన్న మాట్లాడుతూ నాయకులు కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత పాటించాలని, ఓటు హక్కు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ తీరుపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న అనుమానాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

