వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు తగిన సూచనలు

ఈ రోజు మోమిన్ పేట్ మండల కేంద్రం రామ్ నాథ్ గుడుపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పత్తి పంటలపై క్షేత్ర స్థాయిలో తగిన సూచనలు చేశారు. నూతన పద్ధతులతో పంటల దిగుబడి, సమగ్ర తెగుళ్ల నిర్వహణ (ఐ పి ఎమ్), పురుగు మందుల పరిమిత పిచికారీ, చిన్న సన్న కారు రైతుల చట్ట బద్ధమైన వ్యాపార సంస్థ గా ఏర్పడడం, పంటలను వ్యాధుల నుండి కాపాడుకోవడానికి అనుసరించే శాస్త్రీయమైన విధానం, ఎల్ నినో పరిస్థితుల వల్ల వాతావరణ పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మోమిన్ పేట్ మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ రెడ్డి రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ, స్వాతి, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

You may also like...