SAM, MAM పిల్లలకు IFA సిరప్.. పోషకాహారంపై అవగాహన
- జ్యూట్ బ్యాగుల తయారీపై ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం - October 7, 2026
- SAM, MAM పిల్లలకు IFA సిరప్.. పోషకాహారంపై అవగాహన - October 7, 2026
- ఆపదలో అండగా పోచారం భాస్కర్ రెడ్డి - October 6, 2026

బాన్సువాడ :బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో SAM (తీవ్ర పోషకాహార లోపం), MAM (మధ్యస్థ పోషకాహార లోపం)తో ఉన్న పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలకు IFA (ఐరన్, ఫోలిక్ యాసిడ్) సిరప్ అందించి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఫాలోఅప్ను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులకు సమతుల్యమైన పోషకాహారం, పౌష్టిక విలువలు కలిగిన ఆహారం, సరైన ఆహారపు అలవాట్లు గురించి ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించారు. పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాలను సమయానికి అందించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చిన్ననాటి నుంచే అలవర్చడం ద్వారా పోషకాహార లోపాన్ని నివారించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో MLHP ప్రీతి, ANMలు జాన్షీ, కావ్య, ఆశా కార్యకర్తలు జయ, స్వరూప, అంగన్వాడీ టీచర్ సుధారాణి పాల్గొని పిల్లల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించారు. పిల్లల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణతో పాటు తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని వారు తెలిపారు.
