జ్యూట్ బ్యాగుల తయారీపై ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
- జ్యూట్ బ్యాగుల తయారీపై ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం - October 7, 2026
- SAM, MAM పిల్లలకు IFA సిరప్.. పోషకాహారంపై అవగాహన - October 7, 2026
- ఆపదలో అండగా పోచారం భాస్కర్ రెడ్డి - October 6, 2026

బాన్సువాడ: నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్సెటి) ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగుల తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెలలో ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణంతో పాటు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శిక్షణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, పదో తరగతి ఉత్తీర్ణత మెమో జిరాక్స్‌తో పాటు ఐదు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకుని నసురుల్లాబాద్‌లోని ఆర్సెటి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
మరిన్ని వివరాల కోసం 9247540478 నంబర్‌ను సంప్రదించాలని డైరెక్టర్ తెలిపారు.
