ఎల్ నినో ఎఫేక్ట్.. భారీగా తగ్గిన పత్తి దిగుబడి

1001241464.jpg

నాగర్ కర్నూల్: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది పత్తి దిగుబడి భారీగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా సుమారు 2.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినప్పటికీ, అనుకూల వర్షాలు లేక పంట ఎదుగుదల మందగించింది. చివరి దశలో తెగుళ్ల ప్రభావంతో దిగుబడి మరింత తగ్గింది.సాధారణంగా ఎకరాకు 10-12 క్వింటాళ్లు రావాల్సి ఉండగా, ప్రస్తుతం 3-4 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయని రైతులు తెలిపారు. దీంతో పెట్టుబడి కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

You may also like...