పట్టభద్రుల ఓటరు నమోదును విస్తృతంగా చేపట్టాలి..రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
- పద్మమ్మ మృతికి సంఘసేవకులు పాపి శెట్టి రామన్న నివాళి - October 7, 2026
- ఉప్పల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలకు రూ.6 లక్షలతో స్లాబ్ నిర్మాణం - October 7, 2026
- పట్టభద్రుల ఓటరు నమోదును విస్తృతంగా చేపట్టాలి..రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి - October 7, 2026

వెల్దండ అక్టోబర్ 06:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ఆర్ కాంప్లెక్స్‌లో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నవంబర్ 1, 2023 నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డులో పట్టభద్రులను గుర్తించి ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. గతంలో ఓటు వేసిన పట్టభద్రులు సైతం నూతనంగా నమోదు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్, మాజీ ఎంపీపీ పుట్టా రామ్‌రెడ్డి, సింగం విజయ్‌గౌడ్, అనిల్‌కుమార్,కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
