వార్డు మెంబర్ల ఫోరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా శైలజ
- వార్డు మెంబర్ల ఫోరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా శైలజ - October 7, 2026
- సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం - October 5, 2026
- తాళం వేసిన ఇంట్లో చోరీ…. - October 5, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 6: గ్రామపంచాయతీ వార్డు మెంబర్ల ఫోరం నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కట్టంగూర్ మండలం పందనపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు కావట్టి శైలజ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గానగాని రమేష్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
కఈ ఉత్తర్వులను ఫోరం రాష్ట్ర వ్యవస్థాపకులు నాగబెల్లి జ్యోతి మహేష్, రాష్ట్ర కోఆర్డినేటర్ పోగుల నాగార్జునరెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ ఇన్‌చార్జి అందె రవికుమార్ మంగళవారం కట్టంగూరులో శైలజకు అందజేశారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ నియోజకవర్గంలోని వార్డు సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోపాటు ఫోరం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు కానుగు శీను, ఏనుగు సైదులు తదితరులు పాల్గొన్నారు.

