చెరువులు, కుంటలకు హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్‌ 5: మండలంలోని మునుకుంట్ల గ్రామంలో పెద్ద చెరువు, కోమటికుంట, దబ్బికుంటలకు హద్దులు ఏర్పాటు చేసి కబ్జాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్‌ గుల్లి నరేష్ సోమవారం నల్లగొండలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. చెరువులు, కుంటల పరిధిలోని భూములను కొందరు రైతులు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, పారుదల సక్రమంగా లేక పంట పొలాలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు సర్వే నిర్వహించి చెరువులు, కుంటలకు హద్దులు నిర్ణయించి, కబ్జాలను తొలగించి నీటి వనరులను పరిరక్షించాలని కోరారు.

You may also like...