దేవాయిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో ఈరోజు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ నరేష్, ఉపసర్పంచ్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, మండల కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణలోని కోటికిపైగా కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి పేరిట బీమా తీసుకొని, ఒకవేళ ఆ వ్యక్తి మరణిస్తే కుటుంబ సభ్యులకు లేదా నామినీకి రూ.5 లక్షల పరిహారం అందజేయడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డులు లేని కుటుంబాలకు సైతం అర్హత నిబంధనల ప్రకారం ఈ పథకం వర్తించే అవకాశం ఉండటం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆపద సమయంలో ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం ఎంతో ఉపయోగకరమని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాయకులు, అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవులు, మండల అధికారి రఘునందన్, ఎంపీడీవో భరత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పైడి రాజేశ్వర్ రెడ్డి, తాడ్వాయి సొసైటీ చైర్మన్ సుధాకర్ రావు, దేవాయిపల్లి సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి, అంబీర్ శ్యాంరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గైని శివాజీ, రాజేందర్ రావు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...