ఆర్.కృష్ణయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బండమీది వెంకటేష్
- ఆర్. కృష్ణయ్యకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బండమీది వెంకటేష్ - September 13, 2026
- ఆర్.కృష్ణయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బండమీది వెంకటేష్ - September 13, 2026
- శంకర్‌పల్లి సాయి కాలనీ యువ గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఆగమన్ - September 10, 2026

హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ వర్గాల రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండమీది వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్. కృష్ణయ్యకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఆర్. కృష్ణయ్య సాగిస్తున్న సుదీర్ఘ పోరాటాన్ని బండమీది వెంకటేష్ కొనియాడారు. బీసీల హక్కుల సాధన కోసం ఆయన దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఉద్యమాలు వెనుకబడిన వర్గాల్లో చైతన్యాన్ని పెంపొందించాయని పేర్కొన్నారు. బీసీల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన పోషిస్తున్న పాత్ర కీలకమన్నారు.
బీసీ సమాజం ఎదుర్కొంటున్న వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటం మరింత ఉధృతం కావాల్సిన అవసరం ఉందని వెంకటేష్ అన్నారు. బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు, జనాభా ప్రాతిపదికన సముచిత ప్రాతినిధ్యం, విద్యా–ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలు దక్కే వరకు ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో నవాపేట్ మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు లింగం ముదిరాజ్, శంకర్‌పల్లి మండల బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చీర సాయి, నవాపేట్ మండల ఉపాధ్యక్షులు గొల్ల వెంకటేశం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్యకు నాయకులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ బీసీ వర్గాల హక్కుల సాధన, సామాజిక సమానత్వం కోసం మరింత శక్తివంతంగా ఉద్యమించాలని ఆకాంక్షించారు.
