ఐటీఐ, ఏటీసీ కోర్సుల్లో వాక్‌-ఇన్ అడ్మిషన్లు

జ్ఞాన తెలంగాణ,జనగామ ప్రతినిధి,ఆగస్టు 31:
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలకు చెందిన యువతీ యువకులకు ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థలు ITI,అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ ATCల్లో 2026-27/28 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం వాక్‌-ఇన్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రభుత్వ ఐటీఐ ఆలేరు ప్రిన్సిపాల్/కన్వీనర్ శ్రీ ఎస్.వీ.వీ.సత్యనారాయణ తెలిపారు.2026 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు వాక్‌-ఇన్ అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.ఐటీఐ కోర్సులు:1. సోలార్ టెక్నీషియన్ – ఎస్‌ఎస్‌సీ, 1 సంవత్సరం

  1. ఐఓటీ స్మార్ట్ సిటీ – ఎస్‌ఎస్‌సీ, 1 సంవత్సరం
  2. ఎలక్ట్రీషియన్ ఎస్‌ఎస్‌సీ, 2 సంవత్సరాలు
  3. ఫిట్టర్ – ఎస్‌ఎస్‌సీ, 2 సంవత్సరాలు
  4. వెల్డర్ – 8వ తరగతి, 1 సంవత్సరం
  5. కోపా – ఎస్‌ఎస్‌సీ, 1 సంవత్సరం ఏటీసీ కోర్సులు:CNC మెషీనింగ్ టెక్నీషియన్, వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్ FEM, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ – రెండేళ్ల కోర్సులు కాగా, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ & డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్,మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ & ఆటోమేషన్ ఏడాది కాలవ్యవధి కోర్సులుగా ఉన్నాయని తెలిపారు.విద్యార్థులు SSC, కుల ధ్రువీకరణ (Caste), బోనాఫైడ్, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యా ధ్రువపత్రాలు తదితర ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.అడ్మిషన్ల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ విధానంలో జరుగుతుందని, విద్యార్థులు https://iti.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:9110523925, 9885894440

You may also like...