ఓబీసీ సెల్ నూతన కమిటీలకు దరఖాస్తుల ఆహ్వానం
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026
- ఓబీసీ సెల్ నూతన కమిటీలకు దరఖాస్తుల ఆహ్వానం - August 31, 2026

జనగామ: జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఓబీసీ సెల్ నూతన కమిటీల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభం కానుంది.జిల్లా, అసెంబ్లీ, డివిజన్, మండల, టౌన్ మరియు గ్రామ స్థాయిలలో ఛైర్మెన్ మరియు కమిటీ సభ్యుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తులను సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జనగామ డీసీసీ కార్యాలయంలో సమర్పించవచ్చు.పార్టీ బలోపేతానికి కృషి చేసే అనుభవం, ఆసక్తి, నిబద్ధత మరియు క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమానికి ఓబీసీ సెల్ ఆబ్జర్వర్లు తిరుపతి రవీందర్, బాలు యాదవ్ లు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో YTDA మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు లోకుంట్ల ప్రవీణ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల మల్లేష్,జనగామ పట్టణ అధ్యక్షుడు ధోర్నాల వెంకటేశ్వర్లు,ఓబీసీ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ చింతకింది మల్లేష్, కర్రే రాజశేఖర్,జాయ మల్లేష్,ఎదునూరి రవీందర్ ,మచ్చ ప్రవీణ్,కళ్యాణం సమ్మయ్య అలీమొద్దిన్,తదితరులు పాల్గొన్నారు.
