ఇందిరమ్మ ఇళ్లపై సర్పంచుల వాగ్వివాదం.. జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే

వెల్దండ అక్టోబర్ 24: వెల్దండ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ప్రత్యేక అధికారి విజయశ్రీ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసగా మారింది.గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు కేటాయించారంటూ బీఆర్ఎస్ సర్పంచులు ఆరోపించగా, కాంగ్రెస్ సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.దీంతో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.చెరుకూరులో వివాదాస్పదంగా మారిన ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులను రద్దు చేయాలని, అజిలాపూర్‌లో లబ్ధిదారుల జాబితాను పరిశీలించి అర్హులకు ఇళ్లు అందేలా చూడాలని ఎంపీడీవో సులోచనను ఆదేశించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని, నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు.ప్రతి గ్రామపంచాయతీలో వీధి దీపాలకు విద్యుత్ నియంత్రికలు ఏర్పాటు చేయాలని తెలిపారు.సమావేశంలో తహసీల్దార్ భీష్వ కార్తీక్ కుమార్, అధికారులు బసవలింగం,సంధ్యారాణి, హౌసింగ్ ఏఈ పల్లవితో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.1001296737.jpg

You may also like...