చెర్వుఅన్నారంలో పురాతన ఆలయ గోపురం ధ్వంసం!


జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, అక్టోబర్ 9 :



మండలం చెర్వుఅన్నారం గ్రామంలోని పురాతన శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి ఆలయ గోపురాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పెకిలించి ధ్వంసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామంలో కలకలం రేపింది. గోపురాని ధ్వంసం చేసిన దుండగులు గోపురం పై బాగా నున్న ఇత్తడి సుదర్శన చక్రాన్ని అక్కడే వదిలేసి వెళ్లారు. ఈ ఘటనను గ్రామస్థులు గురువారం గుర్తించి సుదర్శన చక్రాన్ని గ్రామంలో భద్రపరిచారు. గోపురంపై ఉన్న ఇత్తడి సుదర్శన చక్రాన్ని చోరీ చేసేందుకు యత్నించినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు గోపురాన్ని ధ్వంసం చేయడం వెనుక నిధుల అన్వేషణ ఉందా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రామస్థులు పునర్నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దేవాలయానికి అభివృద్ధి కోసం గత సంవత్సరం ప్రభుత్వం 50 లక్షలు నిధులు మంజూరు చేసింది అయినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. ఇందులో భాగంగా దేవదాయ శాఖకు డిపాజిట్‌ సైతం చెల్లించారు. టెండర్‌ ప్రక్రియ ప్రారంభమైతే ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి తరుణంలో గోపురం ధ్వంసం కావడం గ్రామస్థులను ఆవేదనకు గురిచేస్తోంది. పురాతన ఆలయాల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఆలయ గోపురాని యుద్ధం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

You may also like...