22 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహం
- 22 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహం - September 13, 2026
- 22 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహం - September 13, 2026
- లోక్ అదాలత్‌లో కేసులకు చెక్.. - September 13, 2026

జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి: స్నేహానికి కాలం, దూరం అడ్డంకులు కావని చెందిప్ప గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు నిరూపించారు. 2004లో చెందిప్ప ప్రాథమిక పాఠశాలలో కలిసి చదువుకున్న మిత్రులు 22 ఏళ్ల తర్వాత ఏడుపాయల వన దుర్గా భవానీ దేవి సన్నిధిలో గెట్ టుగెదర్ నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆత్మీయంగా గడిపారు.భవిష్యత్‌లోనూ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో మహేందర్, శ్రీకాంత్, శ్రీనివాస్, సురేష్, మల్లేశం, మాణిక్య ప్రభు, యాదయ్య, వంశీ పాల్గొన్నారు.
