రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి నిర్వహించనున్న పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉజ్వల్ ఫౌండేషన్ అండగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ సహకారంతో జిల్లాలోని అర్హులైన యువతకు సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట పట్టణాల్లో మూడు కేంద్రాల ద్వారా ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉజ్వల్ ఫౌండేషన్ తరఫున డాక్టర్ ఉజ్వల్ రెడ్డి మూడు కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు జనరల్ స్టడీస్‌కు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. నిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉజ్వల్ ఫౌండేషన్ తరఫున డాక్టర్ ఉజ్వల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనస్, డీఎస్పీ సైదా నాయక్, సీఐ రవి, టౌన్ ఎస్సై లవకుమార్, వినయ్ కుమార్, రాజేందర్ రెడ్డి, కౌన్సిలర్ రంగ, అరుణ్, అతిక్, శ్రీకాంత్ రెడ్డి, అశ్విన్, పవన్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు