​వలీమా వేడుకల్లో పాల్గొన్న జహిరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్, స్థానిక పట్టణంలోని మిలాన్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన వలీమా విందు వేడుకల్లో జహీరాబాద్ శాసనసభ్యులు  మాణిక్ రావు పాల్గొన్నారు. ఝరసంఘం మండలం ఎల్గోయి గ్రామ పార్టీ అధ్యక్షులు బాబు మియా అన్న కుమారుడి వివాహ విందు (వలీమా) సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
​ఈ కార్యక్రమంలో ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, కౌన్సిలర్ అబ్దుల్లా, తుమ్మనపల్లి గ్రామ సర్పంచ్ సోహెల్, మాజీ సర్పంచులు బస్వరాజ్ పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కిజర్ ఖాన్, నందు మహారాజ్, మతీన్, శశివర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You may also like...