మాచిరెడ్డిపల్లి పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పరామర్శ

కోహిర్ మండలంలోని మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) మాజీ అధ్యక్షులు పి. సుదర్శన్ రెడ్డి సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ బాధ్యులు డాక్టర్ ఏ. చంద్రశేఖర్ బుధవారం మాచిరెడ్డిపల్లిలోని సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

You may also like...