రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) జ్ఞానతెలంగాణఝరాసంగం నవంబర్ 16
కోహిర్ మండల పరిధిలోని పిచేర్యాగడి తండాలో అర్హులైన లబ్ధిదారులకు నూతన ‘చేయూత’ పెన్షన్ మంజూరు పత్రాలను తండా సర్పంచ్ రాథోడ్ వినోద్ కుమార్ సోమవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నూతన పెన్షన్ల మంజూరుతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు. గత కొంతకాలంగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం చేయూతనివ్వడం ఎంతో ఊరటనిచ్చిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.